16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి కాంతార మూవీ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీకావు. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్1 తెరకెక్కనుండగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న పలువురు, ఈ సినిమా కోసం పని చేసిన సినీ ప్రముఖులు మృత్యువాత పడటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ నెగిటివ్ కామెంట్ల గురించి నిర్మాత చలువే గౌడ స్పందించి క్లారిటీ ఇచ్చారు.

సినిమా షూటింగ్ సమయంలో దురదృష్టవశాత్తూ  కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని వాటి గురించి క్లారిటీ ఇస్తున్నానని ఆయన తెలిపారు. ఈ సినిమా సెట్ లో ఒకే ఒక్క అగ్ని ప్రమాదం జరిగిందని ఆ ఘటన కాకుండా జరిగిన ఘటనలన్నీ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేకుండా జరిగిన ఘటనలు అని చెప్పుకొచ్చారు.

2024 సంవత్సరం నవంబర్ లో కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరులో జరిగిన ప్రమాదంలో చిత్ర బృందం గాయాలతో బయటపడిందని మేకర్స్ అన్నారు. అదే సమయంలో 2025 జనవరిలో సెట్ లో భారీ  అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆ తర్వాత ఇటీవల రిషబ్ శెట్టి సహా కొందరు టీమ్ సభ్యులు తృటిలో పడవ ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

ఆ సమయంలో కెమెరాలు, ఇతర పరికరాలు నీటిపాలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి 80 శాతం సన్నివేశాలను రియల్ లొకేషన్లలో షూట్ చేశారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను వర్షంలోనే షూట్  చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నెల 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: