అనుపమ పరమేశ్వరన్ ఆగస్టు 22న పరదా అనే మూవీతో మన ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వార్-2, కూలీ వంటి పెద్ద సినిమాలు విడుదలవుతున్న వేళ తన సినిమాను ధైర్యం చేసి విడుదల చేసుకుంటుంది అనుపమ. అయితే పరదా మూవీ బాలీవుడ్ లో ఉన్న లపాతా లేడీస్ మూవీలాగా హిట్ కావాలి అంటూ పలువురు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పరదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ మాట్లాడుతూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన టిల్లు స్క్వేర్ మూవీలో నేను బలవంతంగా నటించాను అంటూ సంచలన కామెంట్లు చేసింది.అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ మూవీలో హీరోయిన్ గా అవకాశం వచ్చినప్పుడు నేను 100 సార్లు ఆలోచించాను.. 

ఈ సినిమాలో నటించాలా వద్దా.. ఇలాంటి బోల్డ్ పాత్రలో నటిస్తే నా అభిమానులు ఒప్పుకుంటారా..ఈ సినిమాని ఆదరిస్తారా అని చాలా ఆలోచించాను. ఇక ఎట్టకేలకు ఈ సినిమా లో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నాను. కానీ ఈ సినిమా పూర్తయ్యే వరకు నేను బలవంతంగానే నటించాను. ఇందులో నటించాలనే ఏ కొద్దీ ఇష్టం కూడా నాకు లేదు.. అలాగే సినిమా ప్రమోషన్స్ కోసం, సినిమాలో పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం కూడా నాకు అస్సలు నచ్చలేదు. వాటిని కూడా నేను బలవంతంగానే వేసుకున్నాను. ఇక సినిమా విడుదలయ్యాక భారీ హిట్ అయింది. ఈ సినిమా రిజల్ట్ చూసి నేను షాక్ అయిపోయాను.

అయితే ఈ సినిమా తర్వాత నన్ను చాలామంది చాలా మాటలు అన్నారు. ఎంతోమంది విమర్శించారు. కానీ వాటన్నింటినీ తీసుకున్నాను.ఎందుకంటే ఈ సినిమాలో నటించే ముందే ఈ పాత్ర పై విమర్శలు వస్తాయి..వాటిని తట్టుకొని నిలబడాలి అనుకున్నాను. నిలబడ్డాను.. ఇక నా అభిమానులు కూడా ఈ సినిమాలో నా పాత్ర పట్ల నిరాశ వ్యక్తం చేశారు. కానీ ఎప్పుడూ ఒకేలాగా రొటీన్ కథలు చేసుకుంటూ పోతే సినిమాల్లో అవకాశాలు రావు కదా.. ఇలాంటి కొన్ని వెరైటీ పాత్రలు కూడా చేయాలి అని వాళ్లకి చెప్పాను. అంటూ టిల్లు స్క్వేర్ మూవీ పై సంచలన వ్యాఖ్యలు చేసింది అనుపమ పరమేశ్వరన్.

మరింత సమాచారం తెలుసుకోండి: