
దానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలేనని చెబుతున్నారు. ఒక సీనియర్ హీరోని టార్గెట్ చేసే విధంగా ఆయన మాట్లాడారన్న ఆరోపణలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతేకాక, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో హీరోగా ఉండకూడదని, బాలీవుడ్‌కు వెళ్లిపోయిన ఆయన అక్కడే ఉండిపోవాలనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అదే కాకుండా, ఈవెంట్‌లో ఫ్యాన్స్‌పై కొంచెం అసహనం వ్యక్తం చేస్తూ, "మీరు ఇలా అరిస్తే నేను వెళ్ళిపోతాను, మైక్ వదిలి వెళ్లడానికి ఒక్క సెకండ్ పట్టదు" అని కొంచెం కోపంగా మాట్లాడారు. దీన్ని కూడా నెగిటివ్‌గా మార్చి చర్చిస్తున్నారు.
అయితే, నందమూరి ఫ్యాన్స్ మాత్రం అలర్ట్ అయ్యారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, గతంలో ఎంతో మంది స్టార్ హీరోలు కూడా స్టేజ్‌పై ఫ్యాన్స్‌పై కోప్పడ్డారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వారు ఫ్యాన్స్ చేతులు కలపడానికి, ఫోటోలు తీసుకోవడానికి వచ్చినప్పుడు చీదరించుకున్న సందర్భాలు ఉన్నాయని. అప్పట్లో ఎవరూ ట్రోల్ చేయలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్‌ను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారని. "అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయే ఏం??" అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. చూడాలి..ఇలాంటి నెగటివ్ కామెంట్ల మధ్య వార్ 2 సినిమా రిలీజ్ అయ్యి ఎంత హిట్ టాక్ తెచ్చుకుంటుందో..?