గత కొద్దిరోజుల నుండి బిపాషా బసూ ని ఉద్దేశించి మృణాల్ ఠాకూర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాని ఎంతలా షేక్ చేశాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ మాట్లాడిన ఈ మాటలు చాలా మంది కి నచ్చలేదు. దాంతో మృణాల్ ఠాకూర్ ని ఏకీపారేశారు. అయితే మృణాల్ ఠాకూర్ బిపాషా బసూ ని ఉద్దేశించి ఏం మాట్లాడింది అంటే..మీకు కండలు తిరిగిన మగాడిలాంటి అమ్మాయి కావాలి అంటే మీరు బిపాషా బసూ దగ్గరికి వెళ్ళండి. ఆమె కంటే నేను ఎన్నో రెట్లు బాగుంటాను అని మాట్లాడింది.అయితే ఈమె మాట్లాడిన మాటలు వివాదానికి దారి తీసాయి. ముఖ్యంగా బిపాషా బసూని మగాడితో పోల్చడం దుమారం రేపిన కామెంట్ అని చెప్పుకోవచ్చు. 

అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా బిపాషా బసూ కౌంటర్ ఇచ్చింది. అందులో ఏముందంటే.. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే చాలా బలంగా ఉండాలి. బలహీనమైన ఆడవాళ్లే ఒకరి ఉన్నతి కోసం కృషి చేయాలి. ఆడవాళ్లు దృఢంగా బలంగా ఉన్నప్పుడే వాళ్లు మానసికంగా శారీరకంగా కూడా ఆనందంగా ఉంటారు. ఆడవాళ్లు బలంగా ఉండకూడదు అని మీ పాతకాలపు ఆలోచన నుండి బయటికి రండి.అని ఓ కొటేషన్ ని షేర్ చేసింది. ఇక ఆ కొటేషన్ కింద మీరు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించుకోండి అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

అయితే బిపాషా బసూ పెట్టిన ఈ పోస్ట్ మృణాల్ ఠాకూర్ ని ఉద్దేశించే పెట్టిందని మృణాల్ ఠాకూర్ కి కౌంటర్ గానే బిపాషా ఇలాంటి పోస్ట్ పెట్టిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.. ఇక చాలామంది బిపాషా బసూ పెట్టిన పోస్ట్ ని సమర్థిస్తున్నారు. మృణాల్ కి బిపాషా గట్టి కౌంటర్ ఇచ్చింది.. లేకపోతే ఒక ఆడదై ఉండి మరో ఆడదాన్ని అలా కించపరుస్తుందా అని కామెంట్లు పెడుతున్నారు. అయితే మృణాల్ ఠాకూర్ బిపాషా బసూని ఉద్దేశించి మాట్లాడిన ఈ మాటలు ఇప్పటివైతే కాదు. గతంలోని పాత వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఈ వీడియో పై ఇప్పుడు దుమారం రేగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: