
ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్ స్టైల్ ఈ సినిమాలో వేరే లెవెల్‌లో ఉందని, అయాన్ ముఖర్జీ డైరెక్షన్ కూడా బాగుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా, అభిమానులు థియేటర్స్ వద్ద పూలమాలతో, అభిషేకాలతో పండగ వాతావరణం తీసుకొచ్చారు. అయితే, కొంతమంది హద్దులు మీరి కటౌట్‌కు రక్తం తిలకం కూడా దిద్దారు. “నీకు కుంకుమ బొట్టు ఎందుకన్నా నేనున్నాను, నా రక్తం చిందిస్తాను” అంటూ వేళ్లు కట్ చేసి, రక్తంతో తారక్ కటౌట్‌కు తిలకం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .
ఈ వీడియోల కింద జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. . “తారక్ ఫ్యాన్స్ ఇంత వైలెంట్‌గా ఉన్నారా?” అని కొందరు ఆశ్చర్యపోతే, మరికొందరు “ఇదెక్కడి మాస్ రా మామ!” అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. .ఇంకొంతమంది, “తారక్ హీరో మాత్రమే కాదు, తమ ఇంటి మనిషి” అని భావోద్వేగంగా స్పందిస్తున్నారు .. నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు — “తారక్‌కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా?” అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా స్టార్స్‌పై ఇంత గొప్ప ప్రేమ చూపించగలరా అని వారు ఆశ్చర్యపోతున్నారు..!