శృతిహాసన్ ఎవరు అంటే అందరికీ టక్కును గుర్తుకు వచ్చేది కమల్ హాసన్ పేరే.. కమల్ హాసన్ సారికల కూతురే శృతిహాసన్.. అయితే అలాంటిది శృతిహాసన్ ని కొంతమంది అసలు నువ్వు కమల్ హాసన్ కూతురివే కాదు అంటూ అవమానించారట. మరి ఇంతకీ శృతిహాసన్ ని కమల్ హాసన్ కూతురివి కాదు అంటూ అవమానించింది ఎవరు..ఎందుకు అలా అవమానించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా వారసులు వస్తే ఆ వారసులు వారి తండ్రులు,తాతలు, మమ్మీల లాగా మంచి నటనతో మెప్పించాలి అనుకుంటారు.ఇక ఇండస్ట్రీకి వచ్చిన వారసులు ఏమాత్రం సక్సెస్ కాకపోయినా కూడా అసలు నువ్వు తండ్రికి తగ్గ తనయుడివే కాదు. తండ్రికి తగ్గ కూతురివే కాదు.. తాతకు తగ్గ మనవడివే కాదు అంటూ ఎంతో మంది తమ మాటల తూటాలతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. 

అయితే ఇలాంటి అవమానమే శృతిహాసన్ కి కూడా జరిగిందట. శృతిహాసన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. దాంతో శృతిహాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్రవేశారు. అంతేకాదు కొంతమంది అయితే శృతిహాసన్ మొహం పట్టుకొని మేము నీపై కమల్ హాసన్ కూతురువి కాబట్టి ఎన్నో అంచనాలు పెట్టుకున్నాం. కానీ మేము పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు నువ్వు లేవు.. అసలు నువ్వు విశ్వనటుడు కమల్ హాసన్ కూతురివేనా.. నీలో ఆయన చేసే నటన కొంచమైనా వచ్చిందా.. అంటూ అవమానించే వారట. అయితే ఈ మాటలు విన్నప్పుడల్లా శృతిహాసన్ కన్నీళ్లు పెట్టుకునేదట.

అయితే ఈ విషయాన్ని తాజాగా కూలి మూవీ ప్రమోషన్స్ లో శృతిహాసన్ చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా తన సినీ కెరీర్ ని మార్చేసిన గబ్బర్ సింగ్ మూవీ సమయంలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ వద్దే వద్దు అంటూ చాలామంది చిత్ర యూనిట్ కి చెప్పారట. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తనని సినిమాలో పెట్టుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశారని, అలాగే పవన్ కళ్యాణ్ సార్ కూడా నన్ను ఆయన సినిమాలో తీసుకోమని చెప్పారంటూ శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: