
ఇదే సమయంలో నానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని అందరినీ సపోర్ట్ చేస్తారని, అందరితో కలివిడిగా ఉంటారని మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన ‘కూలీ’,,"వార్ 2" సినిమాలను థియేటర్‌లో చూడడానికి నాని నానా తిప్పలు పడ్డారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాలను చూసారు. అయితే అక్కడ తనని ఎవరు గుర్తుపట్టకూడదనే ఉద్దేశ్యంతో పూర్తిగా మాస్క్ ధరించి వెళ్లారు. ముఖాన్ని పూర్తిగా కవర్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న వారు నాని ని గుర్తు పట్టలేకపోయారు.
కొంతమంది ఫ్యాన్స్ మాట ప్రకారం..కొత్త లుక్ బయటపడకుండా ఉండటానికే మాస్క్ వేసుకున్నాడట. ప్రశాంతంగా సినిమా చూసి, హ్యాపీగా తిరిగి వచ్చాడు అది చాలు అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి నుంచే నానికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. పలు సందర్భాల్లో ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు. అందుకే ‘వార్ 2’ సినిమా చూడటానికి కూడా ఇంత రిస్క్ చేసి ఉండవచ్చని ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతమంది జనంలో నాని సినిమా చూడటం సులభం కాదు. ఒకవేళ వెంటనే ఎవరైనా గుర్తుపట్టినా..? అక్కడ సెక్యూరిటీ సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అన్ని రిస్క్‌లను పక్కన పెట్టి థియేటర్‌కి వెళ్లి సినిమా చూసి ప్రశాంతంగా తిరిగి వచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.