ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించిన ఈయన దర్శకత్వం వహించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధించడంతో దర్శకుడిగా ఈయనకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈయన దర్శకత్వం వహించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు ఆ మూవీ పై భారీ హైప్ నెలకొంటూ ఉంటుంది. దానితో ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు విడుదలకు ముందు ఫ్రీ సేల్స్ ద్వారానే పెద్ద మొత్తంలో కలెక్షన్లు వచ్చేస్తున్నాయి.

దానితో ఈయన తమిళ సినీ పరిశ్రమలోనే ఫ్రీ సేల్స్ ద్వారా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలతో రికార్డులను సృష్టించాడు. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం లోకేష్ కనకరాజ్ , తలపతి విజయ్ హీరోగా లియో అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విడుదలకు ముందు అత్యంత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ సేల్స్ ద్వారానే 100 కోట్ల కలెక్షన్లను  కొల్లగొట్టింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకోవడంలో విఫలం అయింది. లియో సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ , సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే సినిమాను రూపొందించాడు.

మూవీ నిన్న అనగా ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాపై కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమా కూడా ప్రీ సేల్స్ ద్వారా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇప్పటివరకు తమిళ సినీ పరిశ్రమ నుండి ఫ్రీ సేల్స్ ద్వారా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన రెండు సినిమాలు లియో మరియు కూలీ మాత్రమే. ఇలా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాలు మాత్రమే ఫ్రీ సేల్స్ ద్వారా 100 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. దానితో లోకేష్ కనకరాజ్ తన సినిమాలతో అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk