కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో.. రజనీకాంత్ హీరోగా, నాగార్జున విలన్ పాత్రలో, శ్రుతి హాసన్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ బిగ్ ప్రాజెక్ట్ "కూలీ" ఆగస్టు 14వ తేదీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే కూడా నటించింది. రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సంపాదించుకుంది. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి సినిమా బాగా నచ్చినా, మిగతా హీరోల అభిమానులకు మాత్రం అంతగా నచ్చలేదని తెలుస్తోంది. ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఏకైక నెగిటివ్ కామెంట్ .. లోకేష్ కనగరాజ్  డైరెక్షన్ మార్క్ ఈ సినిమాలో మిస్ అయిందనే విషయం. ఒకప్పుడు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత అద్భుతంగా ఉండేవో, ఇప్పుడు ఆయన తెరకెక్కించిన కూలీ సినిమాలో ఆ మ్యాజిక్ మిస్సయిందని జనాలు అంటున్నారు.


అయితే, కలెక్షన్ల పరంగా మాత్రం "కూలీ" దుమ్ముదులిపేస్తోంది. కోలీవుడ్ సినీ చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. 150.1 కోట్లను క్రాస్ చేసి, రజనీకాంత్ సెన్సేషనల్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డ్ విజయ్ దళపతి నటించిన "లియో" సినిమాకే ఉండేది (148 కోట్లు మొదటి రోజే కలెక్ట్ చేసింది). ఇప్పుడు ఆ రికార్డును రజనీకాంత్ వెనక్కి నెట్టేశాడు. అయితే, ఈ సినిమా 150.1 కోట్లను కలెక్ట్ చేసినప్పటికీ, ఇందులో నటించిన పలువురు నటీనటులు పెద్దగా ఆనందంగా లేరని తెలుస్తోంది.

 

కారణం సినిమాకి వినిపిస్తున్న నెగటివ్ టాక్. ఏ సినిమా హిట్ అవ్వాలన్నా, కలెక్షన్లతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ కూడా చాలా ముఖ్యమైనది. రజనీకాంత్ ఫ్యాన్స్ ఎలాగైనా సినిమాను హిట్ చేస్తారు, భారీ కలెక్షన్లు తెప్పిస్తారు, కానీ మిగతా ప్రేక్షకులకు నటీనటుల పెర్ఫార్మెన్స్‌ బట్టి మౌత్ పబ్లిసిటీ వస్తుంది. కానీ, 150.1 కోట్లను వసూలు చేసిన కూలీ సినిమాలో రజనీకాంత్ పేరు తప్పితే, మిగతా ఏ స్టార్ నటుడి పేరు పెద్దగా చర్చలో లేకపోవడం గమనార్హం. దీనంతటికీ ప్రధాన కారణం .. డైరెక్షన్ లోపం అన్న మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో కూలీ సినిమాలో నటించిన నటీనటులు ఈ కలెక్షన్ల పట్ల పెద్దగా హ్యాపీగా లేరని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: