
అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే పూర్తిగా యాక్షన్ ఫిల్మ్ అని చాలామంది భావించారు. అయితే ‘రాజా రాణి’ సినిమా స్టైల్‌లో ఎమోషనల్ టచ్‌ను చూపించడానికి అట్లీ బాగా కష్టపడుతున్నారట. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు మరియు క్లైమాక్స్‌లో ఈ ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. బన్నీ ఇప్పటివరకు ఇంత ఎమోషనల్ టచ్ ఉన్న సీన్స్‌లో నటించలేదని, ఈసారి మాత్రం అభిమానులను కన్నీళ్లు పెట్టించేలా అల్లు అర్జున్ మరో కోణాన్ని చూపించబోతున్నారని సినీ ప్రముఖులు అంటున్నారు. .
చూడాలి మరి.. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ ఎలాంటి హిట్ సినిమాతో తన ఖాతాలో వేసుకుంటాడో. .‘పుష్ప’ సినిమా వేరే లెవెల్ హిట్ అయింది. ఇప్పుడు దానికంటే డబుల్ హిట్ ఇవ్వగలిగితేనే అల్లు అర్జున్ పేరు ఇండస్ట్రీలో మరింత ఎత్తుకు వెళ్తుంది. ఈ బాధ్యత మొత్తం అట్లీ భుజాలపైనే ఉందని.. . .ఫ్యాన్స్ కూడా “ఇప్పుడు ఏమి చేస్తాడో చూద్దాం” అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు .. ప్రస్తుతం ఈ వార్తే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది . ...!