తమిళ సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన దర్శకులలో మణిరత్నం , శంకర్ ముందు వరసలో ఉంటారు. మణిరత్నం ఎన్నో సినిమాలను రూపొందించి అందులో ఎన్నో మూవీలతో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా ఎన్నో విజయాలను అందుకొని ఎంతో గొప్ప గుర్తింపును దర్శకుడిగా సంపాదించుకున్న ఈయన ఆఖరుగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది.

ఈయన వరుస పెట్టి అనేక సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్న ఆ సినిమాలు మాత్రం ప్రేక్షకులను పెద్ద స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. తాజాగా కమల్ హాసన్ హీరోగా మణిరత్నం థగ్ లైఫ్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో శింబు హీరో గా నటించాడు. ఈ సినిమా భారీ అపజయాన్ని సొంతం చేసుకుంది. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి స్టార్ డైరెక్టర్ ఈమేజ్ ను సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించినప్పటి నుండి అద్భుతమైన విజయాలను అందుకుంటూ వచ్చాడు. దానితో చాలా తక్కువ కాలంలోనే ఈయన స్టార్ డైరెక్టర్ ఈమేజ్ను సొంతం చేసుకున్నాడు. అలాగే అనేక సంవత్సరాలు అదే రేంజ్ లో కెరియర్ను కొనసాగించాడు.

కానీ ఈ మధ్య కాలంలో ఈయన వరుస పెట్టి భారీ అపజయలను అందుకుంటున్నాడు. తాజాగా ఈయన గేమ్ చెంజర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అపజయాన్ని అందుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా చిన్న వయసులో స్టార్ డైరెక్టర్ హోదాకి చేరుకున్న వారిలో లోకేష్ కనగరాజ్ ఒకరు. ఈయన కూడా భారీ విజయాలను అందుకున్న ఈ మధ్య కాలంలో మంచి విజయాలను అందుకోవడం లేదు. దానితో లోకేష్ కూడా మణిరత్నం , శంకర్ ల మాదిరి కెరియర్ను కొనసాగిస్తాడేమో అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk