కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో ఈమేజ్ కలిగిన నటులలో తలపతి విజయ్ ఒకరు. ఈయన సినిమా విడుదల అయ్యింది అంటే చాలు కోలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర హిట్టు , ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా అత్యంత భారీ కలక్షన్లు వస్తూ ఉంటాయి. దానితో ఈయన సినిమా విడుదల తేదీ దగ్గర ఇతర హీరోలు సినిమాలు విడుదల చేయరు. అలా విడుదల చేసినట్లయితే వేరే హీరో సినిమా కలెక్షన్ల పై దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలో ఆ మూవీ బృందాల వారు కాస్త వెనక్కు తాగుతూ ఉంటారు.

కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి సూర్య మాత్రం తాను ప్రస్తుతం నటిస్తున్న కరుప్పు మూవీ తో తళపతి విజయ్ కి ఎదురు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తలపతి విజయ్ ప్రస్తుతం జన నయాగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సూర్య నటిస్తున్న కరుప్పు మూవీ ని కూడా వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇలా ఈ రెండు సినిమాలు కనక వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల అయినట్లయితే ఈ రెండు మూవీ ల కలెక్షన్ల పై కూడా తీవ్రంగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ రెండు సినిమాలను వచ్చే సంవత్సరం పొంగల్ కానుకకే విడుదల చేస్తారా ..? లేదా ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య గ్యాప్ ఉండేలా చూసుకుంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: