జూనియర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం వార్ 2 . బాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆగస్టు 14న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎంత హైలైట్‌గా మాట్లాడిందో.. సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం మూవీ టీం అంతగా స్పందించలేదు. సాధారణంగా ఏ బిగ్ సినిమా రిలీజ్ అయినా, టాక్ ఎలా ఉన్నా, ఖచ్చితంగా సక్సెస్ మీట్‌లు ఏర్పాటు చేస్తూ “మా సినిమా హిట్ అయింది” అంటూ చెప్పుకుంటూ ఉంటారు. కానీ వార్ 2 మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయింది.


ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ ఎలా వినిపించాయో అందరికీ తెలిసిందే. “అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఈ స్టోరీ ఒప్పుకున్నాడు?” అని కొంతమంది ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన పర్ఫార్మెన్స్‌కి మంచి మార్కులు దక్కినా, ఆయన పాత్ర మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. వార్ 2 మొదటి రోజు ₹56 కోట్ల కలెక్షన్ రాబట్టగా, రెండవ రోజు ₹60 కోట్ల మేర వసూళ్లు సాధించింది. మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, టాక్‌లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.



అయినా సరే, జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ అభిమానుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. “ఇది అసలు నమ్మలేకపోతున్నాను. వార్ 2 సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమను చూస్తున్నాను. నేను కూడా మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తున్నాను. మేము చాలా ప్యాషన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ సినిమాకు మీరు అందిస్తున్న సహకారం కోసం హృదయపూర్వకంగా ధన్యవాదాలు” అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఓవర్‌ఆల్‌గా చూస్తే, ప్రేక్షకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌పై సెటైర్లు వేస్తున్నారు. “సినిమా ఫ్లాప్ అయిందని అందరూ అంటుంటే, నువ్వేంటి ఇలా ట్వీట్ చేస్తున్నావ్? నీ సినిమాకి నువ్వే డప్పు కొట్టుకుంటున్నావా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: