
అయితే ఇప్పటికే నాగార్జున వందో సినిమాకు డైరెక్టర్ లాక్ అయ్యారు. తమిళ దర్శకుడు రా. కార్తీక్ తో నాగ్ మూవీ చేయబోతున్నారు. అక్కినేని మన్మథుడి మైల్డ్ స్టోన్ మూవీ కోసం కార్తీక్ అద్భుతమైన స్క్రిప్ట్ ను రెడీ చేశాడని ఎప్పటినుంచో వార్తలు వచ్చాయి. కానీ ఇంత వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. నాగ్ 100వ సినిమా ప్రకటనకు డేట్ ఫిక్స్ అయింది.
ఆగస్టు 29న నాగార్జున బర్త్‌డే. ఈ సందర్భంగా నాగ్ 100వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నది. ఇది మాఫియా నేపథ్యంతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఉండవచ్చని అంటున్నారు. నాగార్జున పుట్టినరోజు నాడు సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటుగా ఓ కాన్సెప్ట్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారని బలంగా టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు