అక్కినేని నాగార్జున తాజాగా జగపతిబాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.ఈ నేపథ్యంలోనే గత వారం పది రోజుల నుండి ప్రోమోలతో సరిపెడుతున్న ఈ షోకి సంబంధించి ఫుల్ ఎపిసోడ్ ఆదివారం స్ట్రీమింగ్ అయింది. దీంతో ఈ ఎపిసోడ్ చూసిన చాలామందికి ఫుల్ మీల్స్ దొరికినంత పని అయింది. ఎందుకంటే నాగార్జున జగపతిబాబు ఈ ఎపిసోడ్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అలా నాగార్జున తనకి సంబంధించిన కొన్ని సినిమాల గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛీ ఛీ  అవీ కూడా ఒక సినిమాలేనా నాది నాకే అసహ్యం అనిపించింది అంటూ నాగార్జున మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఎందుకు నాగార్జున ఈ మాటలు మాట్లాడారు.. వేరే వారి సినిమాలను ఉద్దేశించి అలా  మాట్లాడారా లేక ఆయన సినిమాలను ఉద్దేశించి మాట్లాడారా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. 

అయితే నాగార్జున ఈ మాటలు మాట్లాడింది తన సినిమాలను ఉద్దేశించే. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటించిన ఏ సినిమాలు కూడా తనకి నచ్చలేదట.అలా కొన్ని సినిమాలు విడుదలయ్యాక అసలు ఇవీ ఒక సినిమాలేనా.. అని తన సినిమాలు తనకి నచ్చలేదట. మరి ఇంతకీ నాగార్జున చెప్పిన సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం. నాగార్జున జయమ్ము నిశ్చయమ్మురా షోలో మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు నాన్నగారికి చెప్పాను. అలా విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాను. ఇక ఈ సినిమా బాగానే ఆడింది.కానీ ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు అందరూ ఏఎన్ఆర్ గారి కొడుకట సినిమాల్లోకి వస్తున్నారట.ఎలా ఉంటారో చూద్దాం అని వచ్చారు. అలా కొంతమందికి నేను నచ్చాను నా యాక్టింగ్ నచ్చింది మరి కొంత మందికి నచ్చలేదు. ఆ తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి, మజ్ను, ఆఖరిపోరాటం వంటి సినిమాలు వచ్చాయి.

ఇక ఆఖరిపోరాటం సినిమాలో నేను ఒక బొమ్మలాగా నటించాను అంతే. ఈ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం శ్రీదేవి,రాఘవేంద్రరావు గారిదే.. అలా నేను ఇండస్ట్రీకి వచ్చాక దాదాపు 7 సినిమాల వరకు వాళ్ళు చెప్పింది చేశాను.అంతేకాదు ఏడు సినిమాల లో కొన్ని హిట్స్ ఉన్నా కూడా నాకే నచ్చలేదు. అసలు నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు.దాంతో అప్పుడే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటినుండి నాకు నచ్చిన సినిమాలు మాత్రమే చేయాలి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని నిర్ణయించుకొని మౌన పోరాటం మూవీ చూసి మణిరత్నం గారితో సినిమా చేయాలి అనుకున్నాను. అలా దాదాపు నెల రోజుల పాటు ఆయన్ని ఫాలో అయ్యాను. అలా చివరికి మణిరత్నం గారిని కన్విన్స్ చేసి గీతాంజలి మూవీని చేశాను. అయితే ఈ సినిమా తమిళ్లో తీద్దాం అన్నారు. కానీ నేను మాత్రం మీకు తమిళంలో ఎలాగూ పేరు ఉంది.

కాబట్టి ఒకసారి తెలుగులో ట్రై చేద్దాం. మీ మార్కెట్ పెరుగుతుంది అని సలహా ఇవ్వడంతో ఆయన ఒప్పుకున్నారు. అలా గీతాంజలి సినిమా చేయడంతో నేను అనుకున్న హిట్ నాకు దక్కింది. వారికి కూడా ఇండస్ట్రీలో మార్కెట్ పెరిగింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో చేసిన శివ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా వరుసగా రెండు భారీ హిట్స్ పడడంతో నా కెరియర్ మారిపోయింది.ఇక ఈ రెండు భారీ హిట్ ల తర్వాత వరుసగా 6 సినిమాలు వచ్చాయి. దాంతో నా కెరియర్ చాలా స్ట్రగుల్స్ లో పడింది.ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఇక్కడి వరకు వచ్చాను అంటూ నాగార్జున చెప్పుకోచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: