
విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి'. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు ...... ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి .. ఇటివలే రీలీజైన్ టీజర్, సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అర్జున్ చక్రవర్తి యాంథమ్ రిలీజ్ చేశారు. విఘ్నేష్ బాస్కరన్ ఈ సాంగ్ ని పవర్ ఫుల్ కంపోజ్ చేశారు. విక్రాంత్ రుద్ర రాసిన లిరిక్స్ స్ఫూర్తిదాయకంగా వున్నాయి. దీపక్ బ్లూ, బృథ్వీవ్ సత్యకుమార్ , విఘ్నేష్ పాయ్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ కట్టిపడేశారు. .
ఈ సాంగ్ లో విజయరామరాజు ఫిజికల్ ట్రాన్స్ ఫర్మేషన్ అవుతున్న విజువల్స్ , వండర్ ఫుల్ లోకేషన్స్ అద్భుతంగా వున్నాయి. ఈ సాంగ్ విన్న వెంటనే అందరినీ కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాని కి జగదీష్ చీకాటి డీవోపీ , ప్రదీప్ నందన్ ఎడిటర్ , సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైనర్. . ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది .. సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో నూ మంచి అంచనాలే ఏర్పడ్డాయి. .
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి.. .
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. .
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు