మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా యొక్క షూటింగ్ను మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. నయనతారమూవీ లో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడులో ముందుకు సాగుతుంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా బాగం షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు అనే విషయం మనకు తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర పేరు శంకర వర ప్రసాద్ అని , దానితో ఈ సినిమాకు శంకర వర ప్రసాద్ అనే టైటిల్ను మేకర్స్ ప్రస్తుతం అనుకుంటున్నారు అని , దానిని అధికారికంగా కన్ఫామ్ చేసి ఆగస్టు 22 వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడిటెలివిజన్ షో లో భాగంగా మాట్లాడుతూ ... నా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చిరంజీవి పాత్ర పేరు శంకర వర ప్రసాద్ అని చెప్పుకొచ్చాడు. దానితో చాలా మంది అనిల్ రావిపూడి ఇలా చెప్పాడు అంటే కచ్చితంగా ఈ సినిమాకు శంకర వర ప్రసాద్ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేయనున్నట్లు , అందుకే ఆయన ఈ చిన్న లీక్ ఇచ్చాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాకు ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: