ఈమె ఓ దిగ్గజ హీరోయిన్.. కానీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం కేవలం 10 రూపాయల రెమ్యూనరేషన్ తో. అయితే చాలామంది నటీనటులు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ లు అందుకుంటారు.అయితే ఇప్పటి జనరేషన్లో అయితే హీరోలు మొదటి రెమ్యూనరేషన్ లక్షల్లో,కోట్లలో అదుపుకుంటున్నారు.కానీ ఒకప్పుడు హీరో హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో వారి పారితోషికాలు వందల, వేలలోనే ఉండేవి. ఇక ఒక సీనియర్ నటి పారితోషికం అయితే కేవలం 10 రూపాయలట. అవును మీరు వినేది నిజమే. మరి ఇంతకీ పది రూపాయల పారితోషికం తీసుకున్న ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే జయప్రద.. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో దిగజ నటిగా పేరు తెచ్చుకున్న జయప్రద.. ఇప్పటికీ చెరిగిపోని అందంతో తన అభిమానులను అలరిస్తుంది. 

అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న జయప్రద రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటుంది.అయితే అలాంటి జయప్రద ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తన మొదటి పారితోషికం కేవలం పది రూపాయలు మాత్రమే నట. ఇక జయప్రద సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది భూమి సినిమాతో. ఈ సినిమా 1974లో విడుదలైంది.అయితే ఈ సినిమాలో జయప్రద చిన్న పాత్రలో నటించినందుకు గానూ మూవీ మేకర్స్ ఆమెకు పది రూపాయలు తీసి చేతిలో పెట్టారట.కానీ ఆ పది రూపాయల రెమ్యూనరేషన్ ని కూడా జయప్రద వద్దని చెప్పిందట.కానీ ఆమె మంచితనాన్ని,యాక్టింగ్ ని మెచ్చుకొని నిర్మాత ఆమెకు పది రూపాయలు చేతిలో పెట్టారట.అయితే అప్పట్లో ఈ పది రూపాయలే ఎక్కువ. అయితే పది రూపాయలతో తన కెరీర్ స్టార్ట్ చేసిన జయప్రద ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోలతో నటించే అవకాశం అందుకుంది.

ఇక అప్పట్లో అంటే జయప్రద సినిమాల్లో రాణిస్తున్న తరుణంలో శ్రీదేవితో ఆమెకు చాలా పోటీ ఉండేది  అయితే వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేసినప్పటికీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉండేది. అలా పోటా పోటీగా ఇద్దరు నటీనటులు సినిమాల్లో నటించేవారు. అంతేకాదు ఒకే ఒక్క సినిమాలో శ్రీదేవి నటిస్తే మరో సినిమాలో జయప్రద నటించేది.అలా శ్రీదేవికి డేట్స్ ఖాళీగా లేక రిజెక్ట్ చేసిన సినిమాల్లో జయప్రద.. జయప్రదకు డేట్స్ ఖాళీగా లేక రిజెక్ట్ చేసిన సినిమాల్లో శ్రీదేవి నటించేవారు.. అయితే పది రూపాయల రెమ్యూనరేషన్ తో సినీ కెరీర్ ని స్టార్ట్ చేసిన జయప్రద అసలు సినిమాల్లోకి రావాలని అనుకోలేదట. ఆమె డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నదట.కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి చివరికి సినిమాల్లో స్టార్ హీరోయిన్గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: