
ఈ నెల 27న బుధవారం చవితి సెలవు పడటంతో, ఆ రోజున రిలీజ్ అయ్యే సినిమా ఐదు రోజుల హాలీడే విండోని క్యాష్ చేసుకోవచ్చు. కానీ ఈ సారి ఆ అదృష్టాన్ని టాలీవుడ్ బాగా వదులుకున్నట్లుంది. ఎందుకంటే, మొదట ఈ రోజు రిలీజ్ అవ్వాల్సిన మాస్ మహారాజా రవితేజ ‘మాస్ జాతర’ వాయిదా పడిపోయింది. దీంతో థియేటర్లకు పెద్ద షాక్ తగిలినట్లే. కూలీ, వార్-2 అప్పటికి స్లో అయ్యే అవకాశం ఉన్నందున, వినాయక చవితి రోజున కొత్తగా క్రేజ్ ఉన్న సినిమా వచ్చుంటే బాక్సాఫీస్ రేంజ్ మార్చేసేది. కానీ ‘మాస్ జాతర’ను వెనక్కి జరిపేయడంతో ఆ గోల్డెన్ ఛాన్స్ వృథా అయింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాటల ప్రకారం, ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ సెప్టెంబర్ 12 అని చెబుతున్నారు.
ఏ కారణం చేతనైనా సరే, ఈ డిసిజన్ వల్ల భారీ లాభాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇక ఆ స్లాట్‌లో ఘాటి, మిరాయ్ లాంటి అటెన్షన్ ఉన్న సినిమాలు వచ్చుంటే, బాక్సాఫీస్ దద్దరిల్లేది. కానీ ప్రస్తుతం చవితి వీకెండ్లో రిలీజ్ అవ్వబోతున్నవి సుందరకాండ, త్రిబాణధారి, బార్బరిక్ లాంటి చిన్న సినిమాలే. వీటికి ముందస్తుగా పెద్దగా బజ్ లేకపోయినా, టాక్ బాగుంటే మాత్రం ఆ ఎక్స్‌టెండెడ్ వీకెండ్ వీటికి బంపర్ లాభం వచ్చేలా మారుస్తుంది. మొత్తానికి ఈసారి వినాయక చవితి వీకెండ్‌లో టాలీవుడ్ పెద్ద సినిమాలు లేకపోవడం ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించడమే కాకుండా, బాక్సాఫీస్‌కి కూడా భారీ లోటు తలపెట్టినట్లే.