
చిన్న హీరోలు మాత్రమే కాదు, పెద్ద హీరోలు కూడా ఇదే విధంగా ఉంటున్నారు. అంతే కాదు, ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్‌ను బాగా పొలిటికల్‌గా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేశారు. ఆయనను బూతులు కూడా తిట్టారు. కానీ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ను ఏకాకీ ఎందుకు చేశారు? గతంలో బన్నీ అరెస్టు అయినప్పుడు ఇండస్ట్రీ అంతా అల్లు కాంపౌండ్‌కి వెళ్ళింది కదా. మరి జూనియర్ ఎన్టీఆర్‌కు ఏ సపోర్ట్ అందడం లేదు? ఆయనను ‘తొక్కేయాలని’ చూస్తున్నారా? అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇలాంటి మూమెంట్లో, ఇండస్ట్రీలో సినీ స్టార్స్ సినిమాల పట్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది. స్టార్ట్ డైరెక్టర్స్ “ఏదో తూతూ మంత్రంగా సినిమా తీసేశామా? కోట్లు బడ్జెట్ అని చెప్పాము, స్టార్స్‌కు రెమునరేషన్ ఇచ్చాం. ఆ తర్వాత ఫ్యాన్స్ హిట్ చేస్తారనుకుంటూ ముందుకెళ్తున్నారు” అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది సినీ మేకర్స్ కారణంగా ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి, అది కూడా పెద్ద హీరోల సినిమాలు కావడం గమనార్హం.
ఒకసారి ఒక సినిమా విషయంలో చేసిన తప్పు, మళ్ళీ మళ్ళీ వేరొక సినిమా విషయంలో చేయడం, డైరెక్టర్-ప్రొడ్యూసర్స్ నిర్లక్ష్యం నా..? లేక ఓవర్ కాన్ఫిడెన్స్ నా..? అని అంటున్నారు జనాలు. ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ ఈ విషయంలో పూర్తిగా డిసప్పాయింట్ అవుతున్నారు. “తమ హీరో ఏదో చించేస్తాడు, పొడి చేస్తారు” అని అనుకుంటారు, కానీ ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు రావడం లేదు. ఒక్క స్టార్ హీరో ఒక సినిమాను చూసి రాంగ్ స్టెప్ వేసి ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక ట్రోలింగ్‌కి గురైతే, మరొక స్టార్ హీరో ఇంకొక తప్పు చేయకూడదు. కానీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఎవరి దారి వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి ఆస్తులు వాళ్ళది. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. దీనిపై కొంతమంది సినీ పెద్దలు, ప్రముఖులు, సినీ లవర్స్ మాట్లాడుతూ, “ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ ఇక మారరా?” అని గట్టిగా మాట్లాడుకుంటున్నారు..!