
కొత్త ఇంటిని చాలా గ్రాండ్గా నిర్వహించారాని.. ఈ కార్యక్రమానికి మురళీమోహన్ తో పాటు కమెడియన్ ఆలీ కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వీరి ఇంటిని చాలా అధునాతన టెక్నాలజీ తో పాటుగా మాస్టర్ బెడ్రూమ్స్, కిచెన్, జిమ్ ఇతరత్రా సదుపాయాలన్నీ కూడా ఇందులో సమకూర్చుకున్నారు. అయితే వీరు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన వరండాలో ఉండే భారీ వరల్డ్ మ్యాప్ మరింత ఆకర్షినియంగా నిలుస్తోందట. దివంగత హీరోయిన్ డైరెక్టర్ విజయనిర్మల ఏకైక కుమారుడే నరేష్.. సుమారుగా ఈయన ఆస్తి విలువ 700 కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఈ ఇంటిని సుమారుగా 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు వినిపిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ నూతన గృహాన్ని పూర్తిగా ఇంద్రభవనాన్ని తరిపించేలా డిజైన్ చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. నరేష్ అందులో తన జీవిత ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా కొన్ని అంశాలను కూడా జోడించారు.. పలు రకాల బిజినెస్లలో కూడా బిజీగా ఉన్న నరేష్ ఒక వైపు సినిమాలు చేస్తూనే భారీగా సంపాదిస్తున్నారు. ఈమధ్య ఎక్కువగా తండ్రి క్యారెక్టర్లలో నటిస్తూ అద్భుతంగా పేరు సంపాదించారు. పవిత్ర లోకేష్ మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడ సినిమాలలో కనిపించడం లేదు. గతంలో వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే చిత్రంలో నటించారు.