బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తన కెరియర్లో ఎంతో మంది నటి మణులతో నటించాడు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఆయనకు అద్భుతంగా కలిసి వచ్చింది. ఆమెతో నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇంతకు షారుఖ్ ఖాన్ కి అంతలా కలిసి వచ్చిన ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దీపిక పదుకొనే. షారుక్ ఖాన్ , దీపిక కాంబినేషన్లో 2007 వ సంవత్సరంలో మొదటి సారి ఓం శాంతి ఓం అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దీపిక కు బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి విజయం , అద్భుతమైన క్రేజ్ దక్కాయి. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో నెక్స్ట్ మూవీ రావడానికి కాస్త ఎక్కువ సమయం పట్టింది.

ఆ తర్వాత వీరి కాంబినేషన్లో 2013 వ సంవత్సరం చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత వీరి కాంబో లో 2014 వ సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో నెక్స్ట్ మూవీ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. వీరి కాంబోలో 2023 వ సంవత్సరంలో పఠాన్ అనే సినిమా వచ్చింది.

సినిమా కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వేరే కాంబినేషన్లో జవాన్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో కింగ్ అనే చిత్రం రూపొందుతుంది. ఇప్పటివరకు వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు మంచి విజయం సాధించడంతో కింగ్ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధిస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు. మరి కింగ్ మూవీ తో ఈ జోడి కి మరో విజయం దక్కుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: