తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను సొంతం చేసుకుని తమకంటూ అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నారు. ఇకపోతే ఓ నటిమని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం వస్తే వదులుకొని అల్లు అర్జున్ సినిమాలో అలాంటి పాత్రలోనే నటించింది. ఇంతకు ఆ నటి ఎవరు ..? ఆ పాత్ర ఏమిటి ..? ఎందుకు ఆమె ఆ పాత్రను వదులుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఇట్స్ టైం టు పార్టీ అనే ఐటెం సాంగ్ ఉంటుంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు కనిపిస్తారు. అందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం మొదట ఈ మూవీ బృందం వారు ఉదయభాను సంప్రదించారట. కానీ ఆమె ఈ పాటలో నటించడానికి ఒప్పుకోలేదట. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జులాయి అనే సినిమా వచ్చింది.


మూవీ లో ఓ సాంగ్లో ఉదయభాను కనిపిస్తుంది. దీనితో ఈమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాను ఎందుకు రిజక్ట్ చేశాను అనే దాని గురించి , అలాగే అల్లు అర్జున్ సినిమాలో ఎందుకు నటించాను అనే దాని గురించి క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన సినిమాలో ఆ పాటలో ముగ్గురు హీరోయిన్లలో నేనొకదానిని అందుకే ఆ సినిమాలో నటించలేదు. ఇక జూలాయి సినిమాలో ఆ పాటలో హీరోతో పాటు నేను మాత్రమే కనిపిస్తాను. అలాగే ఆ పాట ద్వారా సినిమా ముందుకు సాగుతుంది. అందుకే ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: