సీనియ‌ర్ హీరోయిన్ సంఘ‌వి గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించిన సంఘ‌వి.. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మ‌రియు డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకుంది. ఆ ఆస‌క్తితోనే ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసింది. 1993లో అజిత్ కుమార్ సరసన `అమరావతి` అనే త‌మిళ చిత్రంలో న‌టించి అరంగేట్రం చేసింది. త‌క్కువ స‌మ‌యంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఐదు భాషల్లో 80కి పైగా సినిమాల్లో నటించింది. ఎక్కువగా రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేసింది.


నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, జగపతిబాబు, అబ్బాస్, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల‌తో తెర పంచుకుంది. త‌న‌దైన అందం, మృదువైన నటన, గ్రేస్‌ఫుల్ డ్యాన్సులతో 90వ ద‌శ‌కంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2016లో సంఘ‌వి ఓ ఐటీ సంస్థ అధినేత ఎన్. వెంకటేశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని బెంగళూరులో స్థిర‌ప‌డింది. పెళ్లి తర్వాత సంఘ‌వి సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితానికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది.
వెంక‌టేశ్ తో ఒక కూతురికి కూడా జ‌న్మనిచ్చింది. ప్ర‌స్తుతం పాప కొంచెం పెద్ద‌ది కావ‌డంతో సంఘ‌వి మ‌ళ్లీ త‌న కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. సినిమాలు చేయ‌క‌పోయిన‌ టీవీ సీరియల్స్, రియాలిటీ షోలు, గెస్ట్ అపియరెన్సుల ద్వారా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలో సంఘ‌వి చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలే కాకుండా ఫ్యామిలీ ఫోటోల‌ను సైతం పంచుకుంటోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: