
ఇందులో హీరోయిన్లుగా ముగ్గురు బ్యూటీస్ .. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ముగ్గురు తమ అందచందాలతో ఈ సినిమాను హిట్ చేయడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. రొమాంటిక్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా మీద వాయిదాలు పడుతూ డిసెంబర్ 5కి మార్చారు. కారణం కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో షూటింగులు ఆగిపోయాయి. దీంతో రాజా సాబ్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కూడా పోస్ట్‌పోన్ అయింది.
తర్వాత చర్చల అనంతరం మళ్లీ షూటింగులు ప్రారంభమయ్యాయి. అయితే, వర్కర్స్ ఫెడరేషన్ – “సమ్మె సమయంలో టీజీ విశ్వప్రసాద్ నోటీసులు పంపించారు” అంటూ, ఇప్పుడు షూటింగ్‌కు వెళ్ళమని బెదిరిస్తున్నట్లు సమాచారం. మూవీ టీం ఆ నోటీసులు వెనక్కి తీసుకుంటామని చెప్పినా, యూనియన్ నాయకులు ఒప్పుకోవడం లేదట. దీంతో వారిని బుజ్జగించే పనిలో టీం బిజీగా ఉంది. ఏకంగా ఇప్పుడు ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఆయనతోనే చర్చలు జరిపే దిశగా మూవీ టీం ముందుకెళ్తుందని సోషల్ మీడియాలో పోస్టులు చర్చనీయాంశంగా మారాయి. రాజా సాబ్ సినిమా వివాదంలో ఇరుక్కోవడంతో ప్రభాస్ పేరు కూడా బాగా ట్రోల్లింగ్ అవుతోంది. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే సమ్మె ఎఫెక్ట్ కారణంగా కొన్ని భారీ సినిమాలు ఆగిపోయాయి. రిలీజ్‌లు కూడా వాయిదా పడే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రాజాసాబ్ సినిమా కూడా వాయిదా తప్పదని అంటున్నారు సినీ ప్రముఖులు..!!