తమిళ సినీ పరిశ్రమలో నటుడి గా అద్వితమైన గుర్తింపును సంపాదించు కున్న వారి లో కార్తీ ఒకరు . ఈయన ఇప్పటివరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. ఆయన నటించిన సినిమాలలో చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

దానితో తెలుగు సినీ పరిశ్రమలో కూడా కార్తీ కి మంచి గుర్తింపు ఉంది. ఇకపోతే తాజాగా కార్తీ తమిళ సీనియర్ నటుడు మరియు దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే తమిళ సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా , దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుందర్ సి ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించాడు. అలాగే ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈయన తన కెరీర్ లో నటించిన ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనను కనబరిచి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే ఈయన దర్శకత్వం వహించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా సొంతం చేసుకున్నాయి.

దానితో దర్శకుడిగా కూడా ఈయనకు మంచి గుర్తింపు దక్కింది. తాజాగా ఈ దర్శకుడు కార్తీ కి ఓ కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఇక సుందర్ చెప్పిన కథ కార్తీ కి బాగా నచ్చడంతో ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , మరికొన్ని రోజుల్లోనే వీరిద్దరి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: