శ్రీలీల తాజాగా జగపతి బాబు హోస్టు గా చేసిన జయమ్ము నిశ్చయమ్మురా షో కి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ షో కి శ్రీలీల మాత్రమే కాకుండా ఆమె తల్లి కూడా వచ్చింది. అలా శ్రీలీల ను ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగి తెలుసుకున్నారు జగపతి బాబు.ఇందులో భాగంగా గుంటూరు కారం సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సందర్భాలు గుర్తు చేసుకున్నారు. అలా జగపతి బాబు గుంటూరు కారం సినిమా షూటింగ్ సమయం లో నీ ఫేస్ లో లెఫ్ట్ లేదా రైట్ లో కాస్త తేడా ఉండేది ఏంటి అది అని అడిగితే మీరు ఆ టాపిక్ వదిలేయండి.. ఆ టాపిక్ తీస్తే నేను మీ టాపిక్ తీయాల్సి వస్తుంది అంటూ బెదిరించినట్లుగా మాట్లాడింది.

అయితే శ్రీలీల మాటలకి నో ప్రాబ్లం.. నువ్వు ఏ టాపిక్ తీసుకున్న నో ప్రాబ్లం అన్నట్లుగా మాట్లాడారు. ఇక గుంటూరు కారం సినిమా టైం లో మేమందరం ఒక దగ్గర కూర్చుంటే మీరు మీ హీరోయిన్ మాత్రం దూరంగా వెళ్లి ఏదో మాట్లాడుకునేవారు.అది ఏంటో ఇప్పుడు మాకు తెలియాలి చెప్పండి అంటూ అడుగుతుంది.అయితే గుంటూరు కారం సినిమా షూటింగ్ సమయంలో ఖాళీగా ఉన్న టైంలో షూటింగ్ లో ఉన్న చాలా మంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకునేవారట

 కానీ జగపతి బాబు రమ్య కృష్ణ మాత్రం దూరంగా కూర్చొని కబుర్లు చెప్పుకునే వారట. ఈ విషయం గురించే శ్రీలీల జగపతిబాబును అడుగుతూ..మీరు రమ్యకృష్ణ గారిని తీసుకొని ఏం కబుర్లు చెప్పారో మాకు ఇప్పుడు తెలియాలి అంటూ మాట్లాడుతుంది. దానికి జగపతి బాబు మీ కుర్ర కుంకలతో పెట్టుకునే బదులు మా సీనియర్ హీరోయిన్ తో మాట్లాడుకోవడం బెస్ట్ అని రమ్యకృష్ణతో నేను మాట్లాడేవాడిని.. అంతకుమించి అందులో ఏమీ లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: