బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటీ నటులు అయినటువంటి సిద్ధార్థ్ మల్హోత్రా ,  జాన్వి కపూర్ జంటగా పరం సుందరి అనే మూవీ రూపాందున విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి ఈ మూవీ పై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కి బుక్ మై షో లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

బుక్ మై షో లో ఈ మూవీ కి ఇప్పటికే 100 కే ప్లస్ ఇంట్రెస్ట్ లు లభించాయి. దీని ద్వారానే అర్థం అవుతుంది ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి అని. ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించిన జాన్వి కపూర్ కి ఈ మూవీ ద్వారా మంచి విజయం దక్కితే ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా హిందీ సినీ పరిశ్రమలో పెరిగే అవకాశం ఉంది. అలాగే సిద్ధార్థ్  మల్హోత్రా కూడా ఇప్పటికే మంచి విజయాలను ఎన్నింటినో అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈయన క్రేజ్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింతగా పెరిగే అవకాశం ఉంది.

జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై కూడా ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. కొంత కాలం క్రితమే ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ లో హీరోయిన్గా నటించిన మంచి విజయాన్ని ఈ బ్యూటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మరికొన్ని రోజుల్లోనే దేవర పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తుంది. అందులో కూడా ఈమె హీరోయిన్గా కనిపించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

jk