సూపర్ స్టార్ రజనీ కాంత్ కి ఉన్న ఈమేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రజిని నటించిన సినిమాలకు హిట్టు , ప్లాప్ టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన స్థాయిలో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. ఇక అదే ఆయన నటించిన సినిమాకు మంచి టాక్ వస్తే ఆ మూవీ కి అద్భుతమైన రీతిలో కలెక్షన్లు వస్తూ ఉంటాయి. తాజాగా రజనీ కాంత్ "కూలీ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. నాగార్జున ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. శృతి హాసన్ , సత్యదేవ్ , ఉపేంద్ర , ఆమిర్ ఖాన్ ఈ మూవీ లో కీలకపాత్రలోలో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఆగస్టు 14 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 11 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 11 రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఎన్ని ..? హిట్ స్టేటస్ కు ఈ మూవీకి ఇంక ఎన్ని కలెక్షన్స్ కావాలి అనే వివరాలను తెలుసుకుందాం.

11 రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 40.87 కోట్ల షేర్ ... 63.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 5.13 కోట్ల షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో రాబడితే క్లీన్ హిట్టుగా నిలుస్తుంది.

11 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 242.40 కోట్ల షేర్ ... 481.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 307 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 64.60 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: