కోలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన నటుడు జయం రవి గురించి చెప్పాల్సిన పనిలేదు.. తన చిత్రాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ బాగానే పేరు సంపాదించారు. ఈమధ్య సినిమాలలో కంటే తన పర్సనల్ లైఫ్ విషయాలలోనే నిరంతరం ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు జయం రవి. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో ఆర్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. అయితే ఇటీవలే అటు జయం రవి, ఆర్తి మధ్య కొన్ని మనస్పర్ధలు కారణం చేత విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఒక ప్రకటన చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఆర్తి భరణం కింద రూ.50 కోట్లు:
ఈ విడాకుల వ్యవహారం తన భార్య ఆర్తికి తెలియకుండా జయం రవి పోస్ట్ పెట్టడంతో కథనాలు వినిపించాయి. అప్పటినుంచి అటు జయం రవి విడాకుల వ్యవహారంతో హాట్ టాపిక్ గా మారారు. తరచూ భార్య పైన ఆరోపణలు చేస్తూ ఉండడమే కాకుండా పలు రకాల పోస్టులు కూడా షేర్ చేస్తూ ఉండేవారు. తన భార్యతో ఉండలేనంటూ జయం రవి కోర్టును కూడా ఆశ్రయించారు. ఆర్తి భరణం కింద రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్ కూడా చేసింది.

ప్రియురాలితో తిరుపతిలో జయం రవి:
ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉన్నప్పటికీ ప్రముఖ సింగర్ కెనిషాతో కలిసి సహజీవనం చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కలిసి అక్కడక్కడ కలిసి తిరుగుతున్న సందర్భాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ వ్యాఖ్యలకు మరింత బీజం వేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా జయం రవి, కేనిషా ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి అక్కడ దర్శించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాలి తిరుమలలో ప్రత్యేకించి మరీ పూజలు చేయించినట్లుగా వినిపిస్తున్నాయి ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్స్ దారుణంగా జయం రవి, కెనిషా ను తిడుతున్నారు. భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రియురాలతో చట్టపట్టలేసుకొని తిరుగుతున్న అంటూ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: