ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ అయిన రియాలిటీ షో `బిగ్ బాస్`. మన ఇండియాలోనూ వివిధ భాషల్లో బిగ్ బాస్ ప్రసారమవుతుంది. మొదటిగా 2006లో హిందీలో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు డ్రామా, వివాదాలు, ఎమోషన్ల మేలవింపుగా ఈ షో ప్రేక్షకులను అలరిస్తూ 18 సీజన్లను కంప్లీట్ చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 19 కూడా ప్రారంభమైంది. ఎప్ప‌టిలాగానే బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


మొత్తం 16 మంది కంటెస్టెంట్లు ఆగ‌స్టు 24న‌ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. అయితే బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్నందుకుగాను సల్మాన్ ఖాన్ హై రేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి బిగ్ బాస్ సల్మాన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఆయ‌న రెమ్యున‌రేష‌న్ లో భారీ కోత విధించారు.


గత సీజన్లకు సల్మాన్ ఖాన్ రూ. 250 కోట్ల రేంజ్ లో పారితోషికం పుచ్చుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 19 కు ఆయ‌న రెమ్యున‌రేష‌న్ ను రూ. 150 కోట్లకు కుదించారు నిర్వాహకులు ఇందుకు కారణం లేకపోలేదు. సీజ‌న్ 19లో సల్మాన్ కేవలం 15 వారాలు మాత్రమే హోస్ట్ చేయనున్నారు. మిగతా వారాల్లో ఫరహా ఖాన్, కరణ్ జోహర్, మరియు అనిల్ కపూర్ వంటి ప్ర‌ముఖులు షోకు హోస్ట్ గా అల‌రించ‌బోతున్నార‌ని.. అందుకే స‌ల్మాన్ రెమ్యున‌రేష‌న్ ను త‌గ్గించార‌ని ఇన్‌సైడ్ బ‌లంగా టాక్ న‌డుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: