
కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ రామ్ చరణ్. కానీ ఏవో కారణాలతో ఆయన సున్నితంగా చరణ్ నో చెప్పాడు. ఆ తర్వాత కొరటాల సేమ్ స్టోరీని మహేష్ బాబుకు వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. కట్ చేస్తే.. `1 నేనొక్కడినే`, `ఆగడు` చిత్రాలతో అప్పటికే వరుస ఫ్లాపుల్లో మహేష్ బాబును శ్రీమంతుడు సినిమాతో కొరటాల మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు మొదటి ఆట నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా అప్పట్లో రికార్డు సృష్టించింది. ఇప్పటికీ శ్రీమంతుడు టీవీలో వస్తుందంటే ప్రేక్షకులకు స్క్రిన్‌కు అతుక్కుపోతుంటారు. అంతలా ఆ సినిమా మెప్పించింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు