ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే కానుకగా కూలీ, వార్2 సినిమాలు ఒకదానికొకటి పోటీగా రిలీజ్ కావడం ఈ రెండు సినిమాలకు నష్టం చేకూర్చింది. వార్2 సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవగా కూలీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్ల విషయంలో అద్భుతాలు చేయలేదు. కూలీ సినిమాకు ఇప్పటివరకు 500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

సినిమా నెట్ కలెక్షన్లు 300 కోట్ల రూపాయలకు అటుఇటుగా ఉన్నాయి. ఓవర్సీస్ లో విడుదలకు ముందు అద్భుతాలు చేసిన కూలీ మూవీ ఆ తర్వాత అదే మ్యాజిక్ ను రిపీట్ చేసే విషయంలో మాత్రం ఫెయిలైంది.  ఈ సినిమాకు తెలుగుతో పాటు అన్ని ఏరియాలలో కొంతమేర నష్టాలూ వచ్చాయి. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు.

రజనీకాంత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అరుదుగా మాత్రమే హిట్లుగా నిలుస్తున్నాయి. రజనీకాంత్ రెమ్యునరేషన్ 250 కోట్ల రూపాయలకు అటుఇటుగా ఉంది.  రజనీకాంత్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అయితే కూలీ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

అందువల్ల నిర్మాతలకు మాత్రం ఈ సినిమాకు సంబంధించి నష్టాలూ వచ్చే అవకాశాలు అయితే లేవని తెలుస్తోంది.  రజనీకాంత్  బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. అయితే రజనీకాంత్ పరిమితంగా రెమ్యునరేషన్ తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హీరోల భారీ పారితోషికాల వల్లే నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలూ వస్తున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: