
అలాంటి వారిలో ఇటీవలే కాలంలో ఎక్కువగా వినిపించిన పేర్లలో నిత్యామీనన్, నివేదా థామస్, విద్యాబాలన్, కాజోల్ తదితర హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకే వస్తోంది సినీనటి మంజీమా మోహన్. ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించిన ఈనటి అనుహ్యంగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది.. అందుకు గల కారణాలను వివరించింది. మంజీమా మోహన్ మొదట బాలనటిగా మలయాళ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 2015లో ఓరు వడకన్ సెల్ఫీ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2016లో నాగచైతన్య నటించిన సాహసం శ్వాసగా సాగిపో అనే చిత్రంలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ లో నారా భువనేశ్వరిగా కనిపించింది. ఆ తర్వాత రెండేళ్లు ఎలాంటి సినిమాలలో కనిపించలేదు.. 2023లో చివరిసారిగా హీరో విశ్వక్ సేన్ నటించినటువంటి "బూ" అనే సినిమాలో కనిపించింది మంజీమా.. కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రముఖ నటుడు గౌతమ్ కార్తీక్ ను ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం పైన చాలానే ట్రోల్స్ వినిపించాయి.
అంతేకాకుండా మంజీమా అధిక బరువు పెరగడంతో ఆమె పైన బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా చాలా దారుణంగా జరిగింది. ఈ విషయంపై ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బరువు తగ్గితేనే తనకు అదనంగా చాలా సినిమాలలో అవకాశాలు రావచ్చు.. కానీ అదే నా జీవితానికి ముఖ్యం కాదు..చాలామందికి హీరోయిన్లను విమర్శించడానికి శరీరం తప్పించి మరేమీ కనిపించదా అంటూ ఆమె ప్రశ్నించింది?..తాను కూడా అధిక బరువు వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని మంజుమా తెలిపింది. తీవ్రమైన నొప్పి కూడా భరించానని..డాక్టర్లను సంప్రదించాను అవసరమైతే సర్జరీ కూడా చేయించుకొని సన్నబడాలనుకుంటున్నారంటూ తెలిపింది.. తనకు పిసిఒడి సమస్య ఉండడంతో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయని వీటివల్లే బరువు పెరిగిపోయానని తెలిపింది.