తమిళ నటుడు శివ కార్తికేయన్ తాజాగా మదరాసి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా చాలా కాలం పాటు కేరిర్ను కొనసాగించిన వారిలో ఒకరు అయినటువంటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. రుక్మిణి వాసంతి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలను వరుసగా విడుదల చేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ ట్రైలర్ బాగుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తుంది.

అలాగే ఈ మూవీ కి సంబంధించిన రన్ టైం ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ అయ్యే సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ దాదాపు 2 గంటల 40 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఇలా ఈ మూవీ భారీ నిడివి తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. కెరియర్ ప్రారంభంలో ఎన్నో విజయాలను అందుకున్న మురుగదాస్ ఈ మధ్య కాలంలో వరుస అపజయాలను ఎదుర్కొంటున్నాడు. మరి మదరాసి సినిమాతో ఈయన మంచి విజయాన్ని అందుకొని మళ్లీ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk