తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా రాణించిన నివేదా పేతురాజ్ అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ విశ్వక్ సేన్, రామ్ పోతినేని, శ్రీ విష్ణు,సాయి ధరంతేజ్ వంటి హీరోల సినిమాల్లో నటించింది. అలాగే పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాలో కూడా నటించింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సడన్ గా తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసి షాక్ ఇచ్చింది.. తాజాగా నివేదా పేతురాజ్ తనకు కాబోయే భర్తతో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసింది.అయితే ఇప్పటికే ఈ జంటకి ఎంగేజ్మెంట్ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఎంగేజ్మెంట్ అయ్యాక తనకు కాబోయే భర్తని అభిమానులకి చూపించింది. 

అయితే నివేదా పేతురాజ్ పర్సనల్ లైఫ్ గురించి ఆ మధ్యకాలంలో ఎన్నో రూమర్లు వినిపించాయి. ఈ రూమర్ల కారణంగా తమిళంలో ఈ హీరోయిన్ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. మరి దీనికి కారణం ఏంటయ్యా అంటే..నివేదా పేతురాజ్ తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు అయినటువంటి ఉదయినిధి స్టాలిన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు ఆ మధ్యకాలంలో రూమర్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. ఉదయినిధి స్టాలిన్ నివేదా పేతురాజ్ ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని నివేదా పేతురాజ్ కోసం ఉదయం నిధి స్టాలిన్ చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నట్టు కూడా వార్తలు వినిపించాయి.అంతేకాదు తమిళనాడులో నివేదా పేతురాజ్ కి దాదాపు 50 కోట్ల విలువ చేసే ఇంటిని కూడా రాసేసినట్టు రూమర్లు వినిపించాయి.

అయితే ఈ రూమర్లు మరీ మితిమీరడంతో ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేసింది నివేదా పేతురాజ్. నా గురించి ఏవేవో రూమర్లు వినిపిస్తున్నాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అంటూ మండిపడింది. అంతేకాదు బుద్ధిలేని వాళ్లు మాత్రమే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తారు అంటూ ట్విట్టర్ ద్వారా ఘాటుగా స్పందించడంతో ఈ వార్తలకు అక్కడితో చెక్ పడింది.అలా తాజాగా ఈ హీరోయిన్ తనకి కాబోయే భర్తని పరిచయం చేయడంతో మరోసారి ఉదయనిధి స్టాలిన్ నివేదా పేతురాజ్ ల వ్యవహారం సోషల్ మీడియాలో జనాలు గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: