త‌మిళ స్టార్ హీరో జ‌యం ర‌వి సినిమాల ద్వారా కన్నా పర్సనల్ మ్యాటర్స్ తోనే వార్తల్లో ఎక్కువ ట్రెండ్ అవుతున్నారు. ఓవైపు భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం మరోవైపు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడ‌నే వార్త‌ల‌తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. త‌న వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌లు రావ‌డానికి కెనీషానే కార‌ణ‌మంటూ ఆర్తి ఇప్ప‌టికే ఆరోప‌ణ‌లు చేసింది. అందుకు త‌గ్గ‌ట్లే జ‌యం ర‌వి ప‌దే ప‌దే కెనీషాతో ద‌ర్శ‌న‌మిస్తూ ఆర్తిని ఊడికిస్తున్నాడు.


తాజాగా కెనీషాతో రిలేష‌న్ ను జ‌యం ర‌వి ఆల్మోస్ట్ క‌న్ఫార్మ్ చేసేశాడు. జ‌యం ర‌వి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. కొత్త ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించే ఉద్ధేశంతో `ర‌వి మోహ‌న్ స్టూడియోస్‌` పేరుతో ప్రొడెక్ష‌న్ హౌస్‌ను స్టార్ట్ చేశారు. ర‌వి మోహ‌న్ స్టూడియోస్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి కెనీషాతో క‌లిసి జ‌యం ర‌వి హాజ‌ర‌య్యారు. కోలీవుడ్ హీరోలు కార్తి, శివ కార్తికేయ‌న్ త‌దిత‌రులు స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేశారు.


అయితే ఈ సంద‌ర్భంగా జ‌యం ర‌వి మాట్లాడుతూ.. త‌న బ్యాన‌ర్ లో కెనీషాను పార్ట్‌న‌ర్‌గా అనౌన్స్ చేశారు. `లైఫ్ లో ఏమి తోచని స్థితిలో చిక్కుకున్నప్పుడు భగవంతుడు మనకు ఏదో ఒకంగా హెల్ప్ చేస్తాడు. అలా నాకు ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కెనీషా. రవి మోహన్ స్టూడియోస్‌లో కెనీషా కూడా భాగ‌మే. ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఇలాంటి వ్యక్తి ఒకరు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా లైఫ్ లో ఆమెలా ఇంతవరకు ఎవరు హెల్ప్ చేయలేదు` అంటూ జయం రవి చెప్పడంతో.. కెనీషా ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. ఇక ఈ సన్నివేశం చూసి కెనీషాతో జయం రవి ప్రేమలో ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి ఉండదని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: