
తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తన క్యూట్ లుక్స్, ఎనర్జిటిక్ యాక్టింగ్ తో జెనీలియా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు సినిమాలే కాకుండా మరోవైపు ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా పనిచేస్తుంది. యూత్ ఐకాన్ గా ఫేమస్ అయ్యింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. దాదాపు 8 సంవత్సరాల లవ్ రిలేషన్‌షిప్ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
తమ ప్రేమకు గుర్తుగా రియాన్ మరియు రాహిల్ అనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చారు. వివాహం అనంతరం పూర్తిగా సినిమాలకు దూరమైన జెనీలియా.. ఇటీవలె బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీస్‌లోకి రీఎంట్రీ ఇచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇకపోతే జెనీలియా ఏజ్ 37. అయిన కూడా తరగని గ్లామర్, అదిరిపోయే ఫిజిక్‌ను మెయింటైన్ చేస్తోంది. రీసెంట్‌గా ఈ బ్యూటీ తన గ్లామర్ వెనుక రహస్యాన్ని రివీల్ చేసింది.
2017లో జెనీలియా శాఖాహారిగా మారిపోయిందట. నాన్‌వెజ్ అస్సలు ముట్టదట. అలాగే పాలు, పాల ఉత్పత్తులను కూడా తీసుకోవడం మానేసిందట. మొక్కల ఆధారిత ఫుడ్ మాత్రమే తీసుకుంటానని.. డైలీ డైట్‌లో తగినంత ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు ఉండేలా చూసుకుంటానని జెనీలియా పేర్కొంది. శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి శారీరక శ్రమపై శ్రద్ధ చూపుతానని తెలిపింది. తన గ్లామర్ మరియు ఫిట్‌నెస్ వెనుక రహస్యం సరైన డైట్, ఆరోగ్యకరమైన జీవనశైలినే అని జెనీలియా వివరించింది.