
అయితే ప్రొఫెషనల్ లైఫ్ కారణంగా పూర్ణ పర్సనల్ లైఫ్ గట్టిగా ఎఫెక్ట్ అవుతోంది. తాజాగా పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ పెట్టిన పోస్ట్ తో ఈ విషయం బయటపడింది. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ కారణంగా దాదాపు 45 రోజుల పాటు పూర్ణ తన భర్తకు దూరంగా ఉంది. భార్య లేకపోవడంతో ఒంటరితనం భరించలేకపోయిన పూర్ణ భర్త షానిద్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఈ 45 రోజుల్లో ప్రేమ గొప్పదనం ఏంటో నాకు తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించే వారు మనతో ఉండటమే నిజమైన వరమని నేను తెలుసుకున్నాను. ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఈరోజు నా భార్య నా దగ్గరకు తిరిగొచ్చేసింది. ఆమెను చూసి ఆనందభాష్పాలు ఆపుకోలేకపోయాను` అంటూ షానిద్ పోస్ట్ పెట్టారు. అయితే కొందరు నెటిజన్లు ఈ పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. భర్తతో పూర్ణకు మనర్సర్థలు వచ్చాయని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ వారిందరికీ షానిద్ క్లారిటీ ఇచ్చాడు.
`నాకు, నా భార్యకు ఎటువంటి ఎడబాటు రాలేదు. సినిమా షూటింగ్స్ నిమిత్తం పూర్ణ 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత జైలర్ 2 మూవీ కోసం తన ఇంటిలో కొద్దిరోజులు ఉంది. మొత్తం 45 రోజులు మేమిద్దరం దూరంగా ఉండాల్సి వచ్చింది. పెళ్లైన తర్వాత ఎన్నడూ ఇంతకాలం వేరుగా ఉండలేదు` అని షానిద్ స్పష్టం చేశాడు.