
భారీ సెట్టింగులు, ఫాంటసీ టచ్, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో సినిమా గ్రాండ్‌గా, ఉత్కంఠభరితంగా రూపొందించేలా క్రిష్ ప్లానింగ్ చేస్తున్నాడట. సినిమాలో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. వాటిలో ఒకటి చారిత్రాత్మకమైన శ్రీకృష్ణదేవరాయ పాత్ర అని టాక్. మిగతా రెండు లుక్స్‌పై మేకర్స్ టాప్ సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే అసలైన సస్పెన్స్ మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీపైనే ఉంది. తొలుత ఆయనను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతిలో సోలో మూవీతో పరిచయం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగా ప్రాజెక్ట్ మొదలై, లుక్ టెస్ట్ కూడా జరిగింది.
కానీ తర్వాత బాలయ్య అభిప్రాయం మార్చారు. తన తండ్రి లెజెండరీ ఎన్టీఆర్, తనను కూడా మొదట సహాయ పాత్రలోనే పరిచయం చేసినట్టు… ఇప్పుడు తనయుడిని కూడా అదే తరహాలో “ఆదిత్య 999 మ్యాక్స్” లో ముందుగా స్క్రీన్‌పై చూపించాలని నిర్ణయించారట. ఇప్పటికే మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లు దాటింది. ఇంతకాలం ఆయన ఎంట్రీపై వస్తున్న రూమర్స్ అభిమానులను ఆతృతకు గురి చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్‌లో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మొదలైతే, బాలయ్యతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఖాయం అవుతుందనే నమ్మకంలో ఉన్నారు ఫ్యాన్స్. బాలయ్య–క్రిష్ కాంబోలో తెరకెక్కబోయే ఈ ఫాంటసీ టైమ్ ట్రావెల్ సాహస యాత్ర తెలుగు సినిమాకి కొత్త మైలురాయిగా నిలుస్తుందా? అనేది చూడాలి!