సినీ ఇండస్ట్రీ అంటే ఎప్పటికప్పుడు సంచలనాలకు, అనూహ్య పరిణామాలకు వేదిక. ఈ రంగంలో ఏదైనా ఎప్పుడు జరిగిపోతుందో ఊహించడం చాలా కష్టం. అందుకే సినిమా ఇండస్ట్రీని “ఏది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేని ఫీల్డ్” అని చాలామంది చెబుతుంటారు. లవ్, డేటింగ్, బ్రేకప్‌లు, విడాకులు .. ఇవన్నీ ఈ రంగంలో చాలా కామన్ విషయాలు. సాధారణ ప్రేక్షకులు వీటిని చూసి ఆశ్చర్యపోయినా, ఇండస్ట్రీలో ఉన్నవారు మాత్రం ఇవన్నీ సహజంగానే తీసుకుంటారు. ఇలాంటి ఇండస్ట్రీలో ఒకప్పుడు అగ్రశ్రేణి హీరోయిన్‌గా వెలుగొందిన ఒక సుందరి ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈమె కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఓ ప్రముఖ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారి జంట అప్పట్లో టాలీవుడ్‌లోనే కాక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. కానీ కొన్నేళ్ల తర్వాత వారి మధ్య వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు పెరిగి, చివరికి విడాకుల వరకు దారితీసింది. ఆ సమయంలో ఈ హీరోయిన్ సోషల్ మీడియాలో అనేక భావోద్వేగపూరిత పోస్టులు షేర్ చేస్తూ “పెళ్లి అంటేనే నాకిప్పుడు విరక్తి కలిగింది. నమ్మకం పూర్తిగా పోయింది” అంటూ స్పష్టంగా చెప్పింది.


ఆమె ఆ భావోద్వేగపూరిత పోస్టులు చూసి చాలా మంది అభిమానులు కూడా సానుభూతి వ్యక్తం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే, ఇప్పుడు అదే హీరోయిన్ మళ్లీ ఇండస్ట్రీలో మరో ప్రముఖ వ్యక్తితో  రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె ఒక ఫేమస్ స్టార్ డైరెక్టర్‌తో ఫారిన్ టూర్‌లో గడిపిన వార్తలు ఇండస్ట్రీ అంతటా సంచలనం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. ఈ జంట ఇటీవల ఓ ఫారిన్ కంట్రీకి వెళ్లి మూడు రోజుల పాటు లగ్జరీగా టైమ్ స్పెండ్ చేసి వచ్చారని చెబుతున్నారు. వీళ్లిద్దరూ కలిసి పబ్లిక్‌లో ఎక్కడా కనిపించకుండా, ఎవరికీ తెలియకుండా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి, అక్కడి నుంచి నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారట. కానీ మీడియా కన్ను తప్పించుకుంటామని అనుకున్నా, ఈ జంట ప్రయాణం గురించి ఉన్న సమాచారం బయటకు రావడంతో గాసిప్‌లు ఊపందుకున్నాయి.



ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె గతంలో పెళ్లి సమయంలో “నేను మోసపోయాను, పెళ్లి అనే వ్యవస్థపై నమ్మకం కోల్పోయాను” అని చెప్పడం గుర్తుచేసుకుని, “అయితే ఈసారి ఏమిటి? ఇది కూడా సరదా కోసమేనా?” అంటూ నెటిజన్లు కఠిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఈ జంటపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులేనా, లేక ప్రేమలో ఉన్నారా, లేదా పెళ్లి దిశగా అడుగులు వేస్తున్నారా అన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎవరూ వెల్లడించలేదు. కానీ ఈమధ్య వీళ్లిద్దరూ కలిసి వెళ్ళిన ఈ సీక్రెట్ టూర్ వల్ల ఇండస్ట్రీలో గాసిప్‌ల ఊచకోత మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: