సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాలు ఎవరికైతే దక్కుతాయో వారికి ఆటోమేటిగ్గా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. మంచి విజయాలు దక్కాక కూడా వారు ఎంచుకునే సినిమాలు , వాటి జోనర్లు వైవిధ్యంగా ఉన్నట్లయితే వారు నటించే తదుపరి మూవీలపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును కలిగిన నటులలో తేజ సజ్జ ఒకరు. ఈయన అనేక సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈయన వరుస పెట్టి సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు.

ఈయన హీరోగా నటించిన సినిమాలలో చాలా సినిమాలు మంచి ప్రేక్షక ఆదరణ పొందాయి. ఆఖరుగా ఈయన హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తాజాగా ఈయన కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఈయన ఆఖరుగా నటించిన హనుమాన్ సినిమా మంచి విజయం సాధించడం , అలాగే మిరాయ్ సినిమా ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఏర్పడ్డాయి దానితో ఈ సినిమా యొక్క ప్రపంచ వ్యాప్త తెలుగు వర్షన్ హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క ప్రపంచ వ్యాప్త తెలుగు వర్షన్ థియేటర్ హక్కులు 24.5 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: