మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీదేవి , బోనీ కపూర్ల కూతురు అయినటువంటి జాన్వి కపూర్ చాలా కాలం క్రితమే హిందీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి క్రేజ్ తో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమెకు హిందీ సినిమాల ద్వారా పెద్ద స్థాయిలో విజయాలు దక్కలేదు. కానీ ఈమె ప్రతి సినిమాలో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈమెకు నటిగా మంచి గుర్తింపు వచ్చింది. ఇలా చాలా సంవత్సరాల పాటు నటిగా హిందీలో కొరియర్ను కొనసాగించిన ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అదిరిపోయే రేంజ్ విజయాలు దక్కలేదు. అలాంటి సమయంలోనే ఈమె తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. జాన్వి కపూర్ కు కూడా మొదటి సూపర్ సాలిడ్ విజయం కూడా ఈ మూవీతోనే దక్కింది. ప్రస్తుతం ఈమె గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాపై అత్యంత భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ తర్వాత ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న దేవర పార్ట్ 2 లో హీరోయిన్గా నటించబోతుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనే అవకాశాలు ఉన్నాయి.

తాజాగా ఈ బ్యూటీ పరం సుందరి అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. మంచి అంచనాల నడుమ ఈ సినిమా తాజాగా విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయినా మొదటి రోజు మొదటి షోకే మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా కూడా జాన్వికి హిందీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందించే అవకాశాలు లేవు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

jk