సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటి మనులకు కెరియర్ను ప్రారంభించిన కొత్తలో చాలా అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అలా అవమానాలు ఎదురయ్యాయి అని సైలెంట్ గా ఉండిపోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తామెంటో నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకొని , అక్కడ కూడా అనేక సంవత్సరాలు పాటు కెరియర్ను కూడా సాగించిన నటిమానులు కొంత మంది ఇండస్ట్రీ లో ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ స్టార్ నటిమణి కాజోల్ ఒకరు. ఈమె కొంత కాలం క్రితం ఇంటర్వ్యూలో పాల్గొంది.

అందులో భాగంగా ఈమె మాట్లాడుతూ ... కెరియర్ ను ప్రారంభించిన కొత్తలో నన్ను నల్లగా ఉన్నావు అని , సన్నగా ఉన్నావు అని చాలా మంది బాడీ షేవింగ్ చేశారు. నేను దానితో మొదట కాస్త బాధపడ్డా ఆ తర్వాత ఆ బాధలను పక్కన పెట్టి లైఫ్ లో సక్సెస్ కావడం కోసం ఎంతో పోరాడాను. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ విజయాలను అందుకుంటూ వచ్చాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే కాజోల్ చాలా సంవత్సరాల క్రితం నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. నటిగా కెరియర్ను మొదలుపెట్టాక ఈమె ప్రతి సినిమాను ఆచి తూచి ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటు , ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోల పక్కన నటించి , తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేసి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. 

స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నాక కూడా ఈమె మంచి అవకాశాలను దక్కించుకుంటూ అదే రేంజ్ లో అనేక సంవత్సరాలు పాటు కెరియర్ను ముందుకు సాగించింది. ఇప్పటికే కాజోల్ 50 సంవత్సరాలలోకి ఎంట్రీ ఇచ్చింది. అయినా కూడా ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో నటిస్తోంది. అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీని కూడా ఇస్తుంది. ఇలా కెరియర్ ప్రారంభంలో బాడీ షేవింగ్ కి గురైన కాజోల్ ఇప్పటికే కూడా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: