ర‌కుల్ ప్రీత్ సింగ్ కెరీర్ బ్యూటీ కాంటెస్టుల‌తో ప్రారంభ‌మైనా.. త్వ‌ర‌గానే తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌తో టాప్ రేంజ్‌లోకి చేరింది. ఒక దశలో సమంత, కాజ‌ల్‌ల‌తో సమానంగా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. సౌత్‌లో మంచి స్థానం సంపాదించుకున్న అనంత‌రం ర‌కుల్ తన ఫోక‌స్ బాలీవుడ్ వైపు మళ్లించింది.


అక్క‌డ‌ అజ‌య్ దేవ‌గ‌న్, సిద్దార్థ్ మ‌ల్హోత్రా, అర్జున్ కపూర్ వంటి హీరోల‌తో ప‌లు సినిమాలు చేసింది. కానీ బాలీవుడ్ లో హిట్స్ క‌న్నా ఫ్లాపులే ప‌ల‌క‌రించ‌డంతో ఆమెకు స్టార్‌డమ్ రాలేదు. ఈమ‌ధ్య కాలంలో ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. ప్ర‌స్తుతం ఆమె కెరీర్ మిక్స్డ్ ఫేజ్‌లో ఉంద‌ని చెప్పాలి. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా ర‌కుల్ మాత్రం ఫిట్‌నెస్ విష‌యంలో ఎప్పుడూ టాప్‌గానే ఉంటుంది. ఆమె ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్. అటువంటి ర‌కుల్ విష‌యంలో తాజాగా ఓ విష‌యం ఫ్యాన్స్ ను ఆందోళ‌న‌కు గురి చేసింది.


రీసెంట్‌గా ర‌కుల్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. అయితే ఆ స‌మ‌యంలో ర‌కుల్ మెడ‌పై ఓ ప్యాచ్ కెమెరాల‌కు చిక్కింది. ఇక అంతే ర‌కుల్ కు ఏమైంది..? ఆమె మెడ‌పై ఆ స్టిక్క‌ర్ ఏంటి..? ఎందుకు ర‌కుల్ ఆ ప్యాచ్ వేసుకుంది..? అంటూ ఫ్యాన్స్ ఆందోళ‌న‌తో ఆరాలు తీయ‌డం స్టార్ట్ చేశారు. అప్పుడే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ర‌కుల్ వేసుకున్న‌ది బాడీలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజ‌ప‌రిచేందుకు రూపొందించిన‌ వెల్‌నెస్ లైఫ్‌వేవ్ ఎక్స్‌39 స్టెమ్ సెల్ ప్యాచ్. ఇది బలం మ‌రియు సత్తువ పెంచ‌డానికి, ఎక్సర్‌సైజ్ పనితీరు మెరుగుదలకు, బలమైన ఆరోగ్యకర జీవనశైలికి, నిద్ర మెరుగుదలకు, శ‌రీర వాపుల‌ను త‌గ్గించ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇటువంటి ప్యాచ్‌లు సెల‌బ్రిటీలు ఎక్కువ‌గా వేసుకుంటూ ఉంటారు. వీటి ధ‌ర వేల రూపాయిలో ఉంటుంద‌ని తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: