నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో బాలయ్య అఘోరగా , రైతుగా రెండు పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన తర్వాత ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు కొనసాగింపుగా అఖండ 2 ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అఖండ మూవీ తర్వాత ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను , రామ్ పోతినేని హీరో గా స్కంద అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ చాలా సినిమాలలో నటించి వాటితో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. కానీ తాజాగా ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయడం లేదు అని కొత్త తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తాం అని ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

దానితో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను జియో హాట్ స్టార్ సంస్థ వారు ఏకంగా 85 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన సినిమాలలో ఓ టి టి హక్కుల ద్వారా అత్యధిక మొత్తం ఈ సినిమాకే వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా అఖండ 2 మూవీ విడుదలకు ముందే అద్భుతమైన రికార్డులను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: