సినిమా ఇండస్ట్రీ లో విజయాలు అద్భుతంగా దక్కుతున్న హీరోయిన్లకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ బ్యూటీ ఇప్పటివరకు నటించిన సినిమాలలో చాలా మూవీలతో మంచి విజయాలను అందుకుంది.ఇక ఈమె ఆఖరుగా నటించిన సినిమాకు ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు దక్కాయి. అలాగే ఆ సినిమాలో ఆమె నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇలా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాలో హీరోయిన్గా నటించిన ఆమెకు ఈ సినిమా తర్వాత అదిరిపోయే రేంజ్ అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆమెకి పెద్దగా అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె ఎవరో కాదు ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని మీనాక్షి చౌదరి.ఈమె ఇచట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈమె హిట్ ది సెకండ్ కేస్ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమె కొంత కాలం క్రితం విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకొని 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇంత గొప్ప విజయం సాధించిన సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమెకు ఈ మూవీ తర్వాత భారీ అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉన్న సినిమాలో అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం ఈమె నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ కి ఎ స్థాయి విజయం దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc