టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో నితిన్ ఒకరు. నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న నితిన్ ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి అపజయాలను సొంతం చేసుకుంటున్నాడు. కొంత కాలం క్రితమే నితిన్ "తమ్ముడు" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే నితిన్ తన తదుపరి మూవీ ని విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది వరకు నితిన్ , విక్రమ్ కాంబోలో ఇష్క్ అనే మూవీ రూపొంది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇష్క్ మూవీ కంటే ముందు కూడా నితిన్ అనేక అపజయాలతో డీలా పడిపోయి ఉన్నాడు. అలాంటి సమయం లో ఇష్క్ మూవీ తో ఆయనకు మంచి విజయం దక్కింది. ఇక ప్రస్తుతం కూడా వరుస అపజాయాలతో డీలా పడిపోయి ఉండడంతో నితిన్ కి విక్రమ్ అద్భుతమైన విజయాన్ని అందిస్తాడు అని కొంత మంది భావిస్తున్నారు. ఇకపోతే గత కొంత కాలంగా నితిన్ , విక్రమ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో నితిన్ గుర్రపు స్వారీ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయితుంది.

తాజాగా ఈ మూవీ.కి మేకర్స్ ఒక టైటిల్ను అనుకుంటున్నట్లు , ఆల్మోస్ట్ దానినే కన్ఫామ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ మూవీ కి స్వారీ అనే టైటిల్ను ప్రస్తుతానికి అనుకుంటున్నాట్లు , అదే టైటిల్ను ఆల్మోస్ట్ కన్ఫామ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. ఒక వేళ నిజం గానే ఈ సినిమాకు స్వారీ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లయితే ఈ సినిమాలో నిజం గానే నితిన్ గుర్రపు స్వారీ చేసే వ్యక్తిగా కనిపించే అవకాశాలు ఉన్నట్లు కన్ఫామ్ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: