
ఇక తాజాగా నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాటల్లోనే - “కల్కి 2 చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇందులో నటీనటులందరి కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. అందరూ ఒకేసారి కుదిరినప్పుడే షూట్ స్టార్ట్ అవుతుంది. అందుకే రిలీజ్ డేట్ గురించి ఇప్పుడే చెప్పడం కష్టమే. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుంది. కనీసం రెండు సంవత్సరాలు టైమ్ పట్టొచ్చు.” అంటే ఆయన మాటల్లోంచి ఒక క్లారిటీ వస్తోంది. షూటింగ్ ప్రారంభమైతే కూడా సినిమా రిలీజ్ 2028 లోనే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్ధమవుతోంది. కానీ ఇక్కడే సస్పెన్స్ ఏమిటంటే – ప్రభాస్ లైనప్. ఇప్పటికే ఆయన దగ్గర రెండు మూడు పెద్ద సినిమాలు ఉన్నాయి.
‘సలార్ 2’, మారుతి సినిమా, మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇలాంటి షెడ్యూల్ మధ్యలో ‘కల్కి 2’ను సరైన టైంలో పూర్తి చేయడం అంత ఈజీ కాదు. మరోవైపు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. “కల్కి 2898 ఏడీ ముగిసిన దగ్గరే ఎగ్జైట్మెంట్ మొదలైంది .. ఇక 2028 వరకు వెయిట్ చేయమంటారా?” అని నెట్‌లో రకరకాల మీమ్స్, పోస్టులతో క్రేజ్ పెంచుతున్నారు. ఎట్టకేలకు నాగ్ అశ్విన్ ఇచ్చిన హింట్స్ ప్రకారం ‘కల్కి 2’ ఒక పెద్ద విజువల్ స్పెక్టాకిల్ కానుంది. కాని దాని కోసం ఫ్యాన్స్ నాలుగైదేళ్లు ఓపిక పట్టాల్సిందే. ఇక ప్రభాస్ – నాగ్ అశ్విన్ మరోసారి ఏ మాయ చేస్తారో చూడాలి.