
ముఖ్యంగా త్రివిక్రమ్ స్టైల్ ,వెంకటేష్ కామెడీ పంచ్ డైలాగులతో సాగే కథతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంపై ఇప్పటికే.. మీనాక్షి చౌదరి, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టి వంటి పేర్లు ఎక్కువగా వినిపించాయి. కానీ తాజాగా చిత్ర బృందం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా కన్నడ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటన రాబోతోంది.
ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్ పైన సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ గా "అలివేలు వెంకటరత్నం" అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ నెల చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సంగీతాన్ని థమన్ అందించబోతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతోంది. వెంకటేష్ సినిమాలలో నటించిన హీరోయిన్స్ కి కూడా భారీగానే క్రేజ్ పెరిగిపోతుంది. అలా శ్రీనిధి శెట్టికి కూడా కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కేజిఎఫ్ 1,2 సినిమాలతో మంచి విజయాలను అందుకోగా గత ఏడాది హిట్ 3 సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా అనే సినిమాలో నటిస్తోంది. వీటికి తోడు కన్నడలో కూడా నటిస్తోంది.